వడదెబ్బ, వడగాలులపై అవగాహన : డి.పి.ఎమ్‌.ఓ..డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌

May 2,2024 15:19

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ లలో సి.హెచ్‌.ఓ లు వడదెబ్బ, వడగాలులు సై అవగాహన కల్పించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ పర్యవేక్షణ అధికారి (డి.పి.ఎమ్‌.ఓ)..డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ సిబ్బందిని ఆదేశించారు. గురువారం డి.పి.ఎమ్‌.ఓ డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ డి.ఎన్‌. ఎమ్‌.ఓ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తో కలసి పి.హెచ్‌.సి కలకడ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా పి.హెచ్‌.సి లో నిన్న కాన్పులు అయిన మహిళను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు సురక్షితమని ఆరోగ్య ఆసరా పథకం పరిధిలో రూ.5000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో వడదెబ్బ, వడగాలులు పై విస్తృతంగా అవగాహన కల్పించాలని,ఓ.ఆర్‌.ఎస్‌ ప్యాకెట్స్‌ తగినన్ని అందుబాటులో ఉంచుకొని పంపిణీ చేయాలని ప్రతీ సచివాలయంలో, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ మరియు పి.హెచ్‌.సి లలో ఓ.ఆర్‌.ఎస్‌ కార్నెర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డి.ఎన్‌.ఎమ్‌.ఓ విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ … స్పర్శ లేని మచ్చలు ఉన్న అనుమానితులు ఉంటే కన్ఫర్మేషన్‌ చేయించుకోవాలన్నారు.

➡️