చట్టాలపై అవగాహన ఉండాలి

May 4,2024 23:32

న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి సాయి కృష్ణ

ప్ర్రజాశక్తి-గోపాలపురం

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఉచిత న్యాయ సలహాలకు మండల లీగల్‌ సర్వీస్‌ ను సద్వినియోగం చేసుకోవాలని కొవ్వూరు సెకండ్‌ ఎడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జి. సాయికృష్ణ అన్నారు. శనివారం మండలంలోని కరకపాడు పంచాయతీ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి సాయి కృష్ణ మాట్లాడుతూ ఎటువంటి వివాదాలు కోర్టు కేసులు లేని గ్రామంగా కరగపాడు గ్రామం నిలిచిందని తెలిపారు. అందుచేత ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు మేరకు గ్రామ ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించడం కొరకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భూ యజమాని హక్కులు, భూ వివాదాలు పై అవగాహన కల్పించారు. నిరుపేదలు ఉచితంగా న్యాయ సేవలను పొందేందుకు మండల లీగల్‌ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఖాళీ ప్రాంసరీ నోట్లు పై సంతకాలు పెట్టరాదని తెలిపారు. చెక్కు బౌన్స్‌లు వాటిపై అవగాహన కల్పించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు రాజి పడేందుకు లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ పడడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని వాటి వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు చిన్న వయసు నుండి చట్టాలపై అవగా హన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి. తారా కుమారి, జానపాటి చంద్రశేఖర్‌, ఎస్‌ఐ కె.సతీష్‌ కుమార్‌, సర్పంచ్‌ బొమ్మన నాగలక్ష్మి, పిఎల్‌వి జానపాటి రత్న కిషోర్‌, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, రవితేజ, గ్రామ పెద్దలు బొమ్మిన నాగరాజు, జక్కు సూర్యచంద్రం, ప్రజలు పాల్గొన్నారు.

 

➡️