Jun 30,2024 23:00
పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష

పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌, చాగల్లు,కొవ్వూరు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 14,272 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ తెలిపారు. మండలంలోని తొగుమ్మి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్‌తో కలిసి ఆయన పెన్షన్‌ పంపిణీ చేసే సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జెసి తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల మేరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని కోరారు. పెన్షన్‌ నగదు చెల్లింపులతో ముఖ్యమంత్రి లేఖను ప్రతి ఒక్కరికీ అందచేసి రసీదు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించారు. కొవ్వూరు రూరల్‌ మండలంలో 10,257 మందికి రూ.6,82,32,000, కొవ్వూరు అర్బన్‌లో 4,015 మందికి రూ.2,78,51,000 పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం కొవ్వూరు అర్బన్‌లో 83 మంది, రూరలోఓ్ల 160 మంది సిబ్బందిని నియమించామన్నారు. 233 మంది సచివాలయ సిబ్బంది, 10 మంది ఇతర శాఖల సిబ్బందిని నియమించి, మ్యాపింగ్‌ చేసినట్టు తెలిపారు. చాగల్లు మండలంలో జరుగుచున్న పెన్షన్స్‌ పంపిణీ ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీత్సవ్‌ ఆదివారం పరిశీలించారు. చాగల్లు-1, నెలటూరు గ్రామ సచివాలయాలను ఆయన సందర్శించారు. ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 05.00 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కె.చంద్ర శేఖర్‌, ఎంపిడిఒ ఎన్‌.బుజ్జి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️