చింతమనేని కాన్వారు తనిఖీ

ప్రజాశక్తి – దెందులూరు

పెదపాడు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద దెందులూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ కాన్వారుని బుధవారం ఉదయం పోలీసులు తనిఖీ చేశారు. అప్పన్నవీడు, హనుమాన్‌ జంక్షన్లలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని దెందులూరు వస్తున్న చింతమనేని కాన్వారుని టోల్‌ ప్లాజా వద్ద ఆపిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా చింతమనేని వారి విధులకు పూర్తిగా సహకరించారు. కాన్వారు లో ఎటువంటి అభ్యంతరకర సామగ్రి లేదని ధృవీకరించిన అనంతరం పోలీసులు చింతమనేని కాన్వారుని ముందుకు అనుమతించారు.

➡️