దిశా పోలీస్‌స్టేషన్‌లోట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ తర్ఫీదు

Nov 23,2023 21:56

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ ఏలూరు దిశా పోలీస్‌స్టేషన్‌లో విధుల నిర్వహణపై గురువారం తర్ఫీదు పొందారు. ఏలూరు రెవెన్యూ విభాగంలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ కొన్నిరోజులుగా నగరంలోని రెవెన్యూ, పోలీస్‌ విభాగాల్లో, ఆయా శాఖల్లో, ఆయా పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించే విధులపై తర్ఫీదు పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌ను నిర్వహించే విధులపై గురువారం తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా దిశా పోలీస్‌స్టేషన్‌ సిఐ విశ్వం, ఎస్‌ఐ క్రాంతిప్రియలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిశ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది నిర్వహించే విధులు, రికార్డుల నిర్వహణ, కేసులో విచారణ వంటి అంశాలపై తర్ఫీదు పొందారు. మహిళలపై జరిగే దాడులు, అఘాయిత్యాలను నిలుపుదల చేయడం, ఈ కేసుల్లో నమోదు చేయాల్సిన సెక్షన్లు వంటి అంశాలపై తర్ఫీదు పొందారు.

➡️