విద్యార్థులకు రైటింగ్‌ ప్యాడ్‌లు వితరణ

ఏలూరు అర్బన్‌ : మండలంలోని పోణంగి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయుచున్న కపిలవాయి పద్మావతి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన రైటింగ్‌ ప్యాడ్‌లను, క్రేయాన్స్‌, పలకలు 233 మందికి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సాబ్జి మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు పద్మావతి పాఠశాలలోని పిల్లలందరితో స్నేహపూరితంగా ఉంటూ, ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పుతూ మంచి క్రమశిక్షణ అలవాడేటట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. అనంతరం అందరికీ స్వీటు, హాటు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కందుల రాంబాబు, ఉపాధ్యాయులు ముస్తఫాఅలీ, శ్యామలాదేవి, శాంతిశ్రీ లత, అన్నపూర్ణమ్మ, ముకుంద లక్ష్మి, కృష్ణవేణి, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

➡️