హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ పరిశీలన

ప్రజాశక్తి – కాళ్ల
మండలంలోని ప్రాతళ్లమెరకలో ఉన్న హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ (నషష )ను శనివారం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ ఎస్‌సి కేంద్ర బృందం డాక్టర్‌ బి.బిందు, డాక్టర్‌ రెహన్‌అహ్మద్‌ కురుషి సందర్శించారు. నూత నంగా నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాళ్ల వైద్యాధికారి ఎం.గులాబ్‌రాజ్‌కుమార్‌, గ్రామ సర్పంచి కంతేటి ఉషా శ్రీనివాసరాజు, గ్రామ కార్యదర్శి బస్వాని ఏసుబాబు, ఎంఎల్‌హెచ్‌పి బి.రజని, ఎఎన్‌ఎం పద్మ, ఆశావర్కర్లు బి.విజయమ్మ, పి.సునీత పాల్గొన్నారు.

➡️