ఓట్లు బహిష్కరించిన గిరిజనులు

ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌
తహశీల్దార్‌, విఆర్‌ఒ చర్చలు
వినతిపత్రం అందించిన అనంతరం ఓట్లు వేసిన గిరిజనులు
ప్రజాశక్తి – కొయ్యలగూడెం
తమ గిరిజన గ్రామాలకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేసి ఐటిడిఎలో కలపాలని కొయ్యలగూడెం మండలం వంక బొత్తప్పగూడెం, మర్రిగూడెం, తంగేళ్లగూడెం, బిల్లిమిల్లి, కిచప్పగూడెం గ్రామాల ప్రజలు సోమవారం ఓటు వేయడానికి నిరాకరించారు. మండలంలో సరిపల్లి గ్రామపంచాయతీ పరిధి మర్రిగూడెం, వంకబొత్తగూడెం గ్రామంలో నివసిస్తున్న గిరిజ నుల్లో 358 మంది ఓటర్లు ఉండగా సోమవారం పోలింగ్‌ నిర్వ హిస్తున్న వంక బొత్తప్పగూడెంలో ఓటు వేయడానికి గ్రామస్తులు వెళ్లకుండా నిరాకరించారు. తమ గ్రామాలకు ప్రత్యేక పంచా యతీ ఏర్పాటు చేసి ఐటిడి పరిధిలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కొయ్యలగూడెం తహశీల్దార్‌ వారి వద్దకు వెళ్లి గిరిజనులంతా కలిసి అధికారులకు వినతిపత్రం అందించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉదయం 9:30 సమ యంలో గ్రామానికి చెందిన ఒకరితో ఓటు వేయించి వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులు తహశీల్దార్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక విఆర్‌ఒ అడపా రాంబాబు గిరిజనులతో మాట్లాడి వారిని ఒప్పించారు. గిరిజనులు రాసుకున్న వినతిప తాన్ని విఆర్‌ఒ రాంబాబుకు అందించిన అనంతరం గిరిజనులు 10:30 గంటలకు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️