నిరుద్యోగ భూతంతో సతమతం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాల వుతుందని, ఆకలి, అసమానతలు, ఆదా య ఆర్జనలో అట్టడుగున నిలిచిం దని ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీ య విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ పేర్కొ న్నారు. శనివారం కడప నగరంలోని ఐఎంఎ హాలులో ప్రముఖ వైద్యని పు ణులు డాక్టర్‌ సి.ఓబుల్‌రెడ్డి అధ్య క్షతన ‘దేశ ఆర్థిక పరి స్థితి… మనభవిష్యత్‌’ పేరిట నిర్వ హించిన సద స్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగి ంచారు. ఈసందర్భ ంగా ఆయన మాట్లాడుతూ ఇటీ వల దేశీ యరైల్వే 35 వేల ఖాళీల నోటిఫికేషన్‌కు 1.25 కోట్ల మంది దరఖాస్తు చేసు కోవడం నిరు ద్యోగం తీవ్రతకు అద్దం పడుతో ందన్నారు. భారత్‌లో 83 శాతం నిరు ద్యోగం ఉందని, వీరిలో 68 శాతం మంది చదువుకున్న నిరుద్యో గులు న్నారని తెలిపారు. ఈలెక్కన నిరుద్యోగ రేటు 24 శాతంతో సతమత మవు తోం దని చెప్పారు. పొరుగున ఉన్న బంగ్లా దేశ్‌లో 12 శాతం, జపాన్‌లో ఆరు శాతం, కొరియాలో మూడు శాతం నిరు ద్యోగులను కలిగి ఉందని చెప్పారు. ఇటీ వల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ యుద్ధం లో పాలస్తీని యన్ల ఉద్యోగాలను ఇజ్రా యెల్‌ తొలగించిందని, పాలస్తీ నియన్‌ ఉద్యో గుల స్థానంలో భారత్‌ లోని హర్యానా, యుపి, ఎంపి, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ సెంటర్లలో నిరుద్యోగులు బారులు తీరారని తెలి పారు. ఇటీవల ఉక్రెయిన్‌ నుంచి పాత బస్తీలో ఓ యువకుని మృత దేహం వచ్చిందని, దీనిపై ఆరా తీస్తే ఇటీవల ఉక్రె యిన్‌ యుద్ధం లో రష్యా భారత్‌లో చేపట్టిన రిక్రూ ట్‌మెంట్‌లో వెళ్లిన యు వకుని మృత దేహమని తేలిందని చెప్పారు. ఇటు వంటి ఘటనల్ని పరిశీ లిస్తే నిరుద్యోగ సమస్యతో భారత్‌ సతమ తమవుతోందని చెప్పారు. జి20 సమా వేశాల అనంతరం ప్రధాని 83 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున పిడిఎస్‌ పంపిణీ చేస్తామని ప్రకటించడం విస్మయాన్ని కలి గించిందని తెలిపారు. అనంతరం ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 140వ స్థానంలో అట్టడుగున నిలిచిందన్నారు. జి20 సమావేశాల నినాదమైన వసుదైన కుటుంబ స్లోగన్‌లో మణిపూర్‌ రాష్ట్రానికి చోటు లేదని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజె పి పాలకులు దేశానికి నాయకత్వం వహిస్తే దేశం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. భారత్‌లో అసమా నతల విలయంలో కొట్టు మిట్టాడుతో ందని చెప్పారు. ఒక శాతం మంది దగ్గర ఉన్న ఆస్తులు 44 శాతం, 22 శాతం ఆదాయం, ఒక శాతం దగ్గర పో గుపడి ఉందని తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో భారతీయులే 93 వేల మందితో అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికన్‌ రికార్డులు చెబుతున్నాయని, ఇందులో 23 వేల మంది వైబ్రంట్‌ గుజ రాతీయులే ఉన్నారని ఎత్తి చూపించారు. దేశంలో 53 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగ నల్ల చట్టాలను 147 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి ఆమో దించడం ప్రజాస్వామ్య పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇంతటితో ఆగకుండా రైతులను దేశద్రోహులని, ఖలీస్థా నీయులని ఆరో పించడం దారు ణమన్నారు. హర్యానా ఎన్నికలొస్తే నల్ల చట్టాలను ఎవరు చెప్పకుండా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని, ఎన్ని కలు పోగానే మళ్లీ ప్రవేశపెట్టారని, ఎవరు ఉపసంహరించమన్నా రని, ఎవరు ప్రవేశపెట్టమన్నారో తెలియడం లేదని విమర్శించారు. సమాజంలో కులాల, మతాల మధ్య విద్వేషాగ్నుల్ని రెచ్చగొట్టి దేశా న్ని అతలాకుతలం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్లు ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అంతకు ముందు ఎకనమిక్‌ రీసెర్చ్‌ స్టూడెంట్‌ మల్లె భాస్కర్‌ మాట్లాడుతూ ప్రపంచ ఐదవ ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని పేర్కొనడంలో డొల్లతనాన్ని ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో ఎపి సిటీజన్‌ ఫోరం కో-కన్వీనర్‌ లకీëరాజా, వైద్యులు రాజావెంగల్‌రెడ్డి, సునీత, సుద ర్శన్‌రెడ్డి, శివరాం, లెనిన్‌ప్రసాద్‌, కుమారస్వామిరెడ్డి, రామ్మోహన్‌, శ్రీనివాసులరెడ్డి, మనోహర్‌, లకీëదేవమ్మ, పెద్దఎత్తున మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. భారత్‌లో అసమా నతల విలయంలో కొట్టు మిట్టాడుతో ందని చెప్పారు. ఒక శాతం మంది దగ్గర ఉన్న ఆస్తులు 44 శాతం, 22 శాతం ఆదాయం, ఒక శాతం దగ్గర పో గుపడి ఉందని తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో భారతీయులే 93 వేల మందితో అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికన్‌ రికార్డులు చెబుతున్నాయని, ఇందులో 23 వేల మంది వైబ్రంట్‌ గుజ రాతీయులే ఉన్నారని ఎత్తి చూపించారు. దేశంలో 53 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగ నల్ల చట్టాలను 147 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి ఆమో దించడం ప్రజాస్వామ్య పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇంతటితో ఆగకుండా రైతులను దేశద్రోహులని, ఖలీస్థా నీయులని ఆరో పించడం దారుణమన్నారు. హర్యానా ఎన్నికలొస్తే నల్ల చట్టాలను ఎవరు చెప్పకుండా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని, ఎన్ని కలు పోగానే మళ్లీ ప్రవేశపెట్టారని, ఎవరు ఉపసంహరించమన్నా రని, ఎవరు ప్రవేశపెట్టమన్నారో తెలియడం లేదని విమర్శించారు. సమాజంలో కులాల, మతాల మధ్య విద్వేషాగ్నుల్ని రెచ్చగొట్టి దేశా న్ని అతలాకుతలం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్లు ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అంతకు ముందు ఎకనమిక్‌ రీసెర్చ్‌ స్టూడెంట్‌ మల్లె భాస్కర్‌ మాట్లాడుతూ ప్రపంచ ఐదవ ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని పేర్కొనడంలో డొల్లతనాన్ని ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో ఎపి సిటీజన్‌ ఫోరం కో-కన్వీనర్‌ లకీëరాజా, వైద్యులు రాజావెంగల్‌రెడ్డి, సునీత, సుద ర్శన్‌రెడ్డి, శివరాం, లెనిన్‌ప్రసాద్‌, కుమారస్వామిరెడ్డి, రామ్మోహన్‌, శ్రీనివాసులరెడ్డి, మనోహర్‌, లకీëదేవమ్మ, పెద్దఎత్తున మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

➡️