విద్యార్థికి న్యాయం జరిగే వరకూ పోరాటం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజి నీరింగ్‌ కళాశాలలో సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని రీను మహంక్‌కు సంపూర్ణ న్యాయం దక్కే వరకూ ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యార్థి మృతికి నిరసనగా మంగళ వారం ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, టిఎన్‌ ఎస్‌ఎఫ్‌, ఎబివిపి విద్యార్థి సంఘాల నాయకులు కడప-చెన్నై రహదారి నుంచి ర్యాలీగా వెళ్లి అన్నమాచార్య కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాల ప్రధాన గేట్లు ముసివేయడంతో విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడే బైఠాయించి యాజమాన్యం బయటకు రావాలని నినాదాలు చేయడంతో కళాశాల వైస్‌ చైర్మన్‌ చొప్పా యల్లారెడ్డి, ప్రిన్సిపల్‌, సిబ్బందితో కలిసి వచ్చి విద్యార్ధి నాయకులతో మాట్లాడారు. మృతి చెందిన విద్యార్ధిని కుటుం బానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వాదోవపవాదాలు జరు గుతుండగా విద్యార్థి సంఘాల నాయకుడిపై కళాశాల యాజ మాన్యం చొక్కా పట్టుకొని లాగి దాడికి యత్నించడంతో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గంగి రెడ్డి, పోలీసుల చొరవతో గొడవ సర్దుమనిగింది. ఈ సందర్బం గా విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థినికి న్యాయం దక్కేవరకు పోరాడతామని, రెండురోజుల్లో న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంటు అధ్యక్షులు పోలి శివకుమార్‌ పాల్గొన్నారు. రాయచోటి : రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న రేణుకకు న్యాయం చేయాలని పిడిఎస్‌యు నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మాసాపేట ప్రాంతంలో పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రేణుక అనుమా నాస్పదగా మతి చెందిందన్నారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు పట్టణ సహాయ కార్యదర్శలు చిన్నారెడ్డి, అంజి, పట్టణ ఉపాధ్యక్షలు శేషాద్రి, మహేష్‌రెడ్డి, పట్టణ నాయకులు ప్రసాద్‌,శివ, కేశవ పాల్గొన్నారు.

➡️