జిసిసి లక్ష్యం 60కోట్లు : డిఎం

Apr 25,2024 21:49

 ప్రజాశక్తి – సాలూరు : 2024-25 సంవత్సరానికి జిసిసి వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లు అని డివిజనల్‌ మేనేజర్‌ వి.మహేంద్రకుమార్‌ చెప్పారు. గురువారం స్థానిక జిసిసి డిపో కార్యాలయంలో బిఎం జె.రామారావుతో కలిసి సాలూరు, మక్కువ, పాచిపెంట, రామభద్రపురం, మెంటాడ మండలాలకు చెందిన సేల్స్‌మాన్లు, కాంట్రాక్టు సేల్స్‌ మాన్‌లు, డీలర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.56కోట్లు లక్ష్యం కాగా, ఈ ఏడాది రూ.60 కోట్లకు చేరినట్లు తెలిపారు. వచ్చే ఏడాది కూడా రూ.60 కోట్లు లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు డిఆర్‌ డిపోల అమ్మకాలు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, డిఆర్‌ స్టాకులపై సమీక్ష నిర్వహించారు. రానున్న ఏడాదిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సిబ్బంది సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకుల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ తనిఖీమండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జిసిసి నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను డిఎం మహేంద్ర కుమార్‌ తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న సరుకుల నిల్వలు, స్టాకులు, రికార్డు లను పరిశీలించారు. సాలూరు మండలానికి చెందిన 8 డిపోల సరుకులు పాచిపెంట, మక్కువ మండలాలకు మ్యాపింగ్‌ కావడంతో ఆ సరుకులు ఆ డిపోలకు అలాట్‌మెంట్‌ చేసినట్లు గోడౌన్‌ ఇన్‌ఛార్జి రాములు తెలిపారు. దీనిపై సివిల్‌ సప్లరు డిఎం, డిఎస్‌ఒలకు ఫిర్యాదు చేశామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో అకౌంటెంట్‌ గొంతెమ్మ వున్నారు.

➡️