ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి

May 8,2024 20:57

ప్రజాశక్తి-నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ ఇచ్చి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి తెలిపారు. బుధవారం మండలంలో టెక్కలి, చంద్రంపేట, చినబూరాడపేట, పెదబూరాడపేట, పారశాం, కొండవెలగాడ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారక రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అతి తక్కువ కాలంలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తానని హామీనిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులను పరిశ్రమలకు అనుసంధానించడం ద్వారా రైతులకు అదనపు లాభాలను తీసుకు వచ్చే మార్గాలు కల్పిస్తానని తెలిపారు. ప్రచారంలో టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️