ఉపాధ్యాయ ఉద్యమ ఊపిరి దాచూరి రామిరెడ్డి : యుపిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపి మూర్తి

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమ గోదావరి) : ఉపాధ్యాయ ఉద్యమ ఊపిరి దాచురి రామిరెడ్డి అని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు. భీమవరం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో దాచురి రామిరెడ్డి 8వ వర్ధంతిసభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి పట్టాభి రామయ్య అధ్యక్షత వహించగా గోపి మూర్తి మాట్లాడారు .దాచూరి రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ లో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వ్యవస్థాపకులో ఒకరిని గుర్తు చేశారు .అర్ధ శతాబ్దంపాటు ఉపాధ్యాయ ఉద్యమమే ఊపిరిగా పోరాటలే జీవితంగా రామిరెడ్డి పని చేశారన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో 1938 జనవరి 15న జన్మించారన్నారు.. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వ్యవస్థాపకునిగా
ఆయన నెల్లూరు జిల్లా రావూరి సమితి మద్దెలమడుగు గ్రామంలో 1958లో ఉపాధ్యాయ వఅత్తిలోకి ప్రవేశించారన్నారు. ఆ నాటి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారన్నారు.1959లో ఆ నాటి రావూరి సమితి ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యదర్శిగా ఉద్యమ జీవితం ప్రారంభించారాని పేర్కొన్నారు . 1960 నుండి 1968 వరకు నెల్లూరు జిల్లా కమిటీ కార్యదర్శి గా. అనంతరం ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఆ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారన్నారు.. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉంటూనే 1970లో ప్రకాశం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పరీక్షా విధానంలో నూతన ఒరవడి తెచ్చారన్నారు.. ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన అవకాశవాద దోరణులను ఎదిరించి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాలతో ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అప్పారి వెంకటస్వామి నాదెళ్ళ సీతారామాచారి సూర్యనారాయణరాజు లాంటి నేతలతోకలసి 1974 ఆగష్టు 10న ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. యుటిఫ్‌ ఆవిర్భావం నుంచి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షునిగా 1981 నుండి 2000 లమధ్య సేవలందించారన్నారు.. సమరశీల పోరాటాలు నడవడమే కాకుండా, ఒక్కోరోజు సమ్మెతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావును ఒప్పించి రీగ్రూపింగ్‌ స్కేల్స్‌ పై ఆధారపడిన ఆటోమాటిక్‌ అడ్వాన్స్‌ మేంట్‌ స్కేల్‌ తేవటంలో ఆయన దూరదఅష్టి నాయకత్వ లక్షణంతో పాటు సభయస్ఫూర్తి కనిపిస్తుందన్నారు.. నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలసిన జీవనశైలి ఆయనదన్నారు. 16ఏళ్ల ఉద్యోగ సర్వీసును వదలి యుటిఫ్‌ లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారని పేర్కొన్నారు 1982లో యుటిఫ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి శసనభండలి సభ్యునిగా గెలుపొందారన్నారు.. 2007లో మరల ఎం.ఎల్‌.సి.గా విజయంసాధించారన్నారు.
1981-84 మధ్య ఉపాధ్యాయులు సాధించుకున్న రీగ్రూపింగ్‌ స్కేళ్ళు, ప్రధానోపాధ్యాయులను స్కేల్స్‌, బి.ఇడి అర్హత లేకుండా ఎస్‌.జి.టి. ఉపాధ్యాయులకు టైం స్కేల్‌ భాషా పండితుల 1983 అప్‌ గ్రేడేషన్‌, ఎయిడెడ్‌ టీచర్లకు డైరెక్ట్‌ పేమేంట్‌,ఎయిడెడ్‌ ఉపాధ్యాయల ఉద్యోగ రక్షణ, రిటైర్మెంట్‌ సౌకర్యాల వంటివన్నీ ఆయన నేతఅత్వంలో జరిగిన ఉమ్మడి పోరాట విజయాలన్నారు.ఈకార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శిలు జి.రామకృష్ణ రాజు, సి.హెచ్‌.కుమారబాబ్జి, జె.వి.వి.జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.ప్రసాదరావు నాయకులు జి.అబ్రహం, బి.నాగబాబు, వి.ఎస్‌.పి.శ్రీనివాస్‌, కె.వామనమూర్తి, జి.వి.మురళీధర్‌, కె.రవిచంద్ర కుమార్‌, ఎం.శివరామరాజు, ఎ.లక్ష్మీనారాయణ, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️