సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం

Jun 27,2024 20:45
సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం

మాట్లాడుతున్న మంత్రి నారాయణ
సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం
ప్రజాశక్తి-నెల్లూరుప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పరిపాలన సాగుతుందని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణా భివద్ధి శాఖమంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌తో కలిసి హౌసింగ్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, మైన్స్‌, విద్యుత్‌ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరుపై మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలకు అభివద్ధి, సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చెప్పారు.. త్వరలోనే మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివద్ధిపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️