ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Mar 28,2024 13:37 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. గురువారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తిరుపతయ్య తన ప్రసంగానికి కొనసాగిస్తూ దేశంలో మతోన్మాద బిజెపి విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా వేదిక ఏర్పడిందని అన్నారు. ఈ వేదిక నుండి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 10 సంవత్సరాల బిజెపి పాలనలో భారత రాజ్యాంగం ధ్వంసం చేసే విధంగా పరిపాలన ఉందని అన్నారు. మరల బిజెపి గెలిస్తే దేశం అదోగతి పాలవుతుందని అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మూడు బీజేపీ జపం చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదని అన్నారు. విభజన హామీలను అమలపరచలేదని విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అసెంబ్లీకి, పార్లమెంట్లకు కార్మిక వర్గ, రైతాంగ ప్రతినిధులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా పోరాటాలను బయట నిర్వహిస్తుంటే చట్ట సభల్లోమాట్లాడే ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంగళగిరి వేదిక అభ్యర్థి ఉంటాడని, అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు జాలాది జాన్ బాబు, సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, పి బాలకృష్ణ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చంగేయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️