‘పించన్ల’ ఇబ్బందులు

Apr 4,2024 10:14 #Guntur District

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సామాజిక భద్రతా పించన్లు తీసుకునేందుకు వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి తిరిగి పించన్లు పంపిణీ చేయాల్సిన సచివాలయ సిబ్బంది ఒకచోట కూర్చుని పించన్లు పంపిణీ చేస్తున్నారు. పించన్లు తీసుకునేందుకు వృద్ధులు వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. పించన్లు తీసుకునేందుకు క్యూలో నిలబడాల్సి రావటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలు పడుతున్నారు.

➡️