గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Dec 9,2023 17:11 #Konaseema
help to pregnant women

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం మండలంలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యాధికారిణి డా. పి రత్నకుమారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట గైనకాలజిస్ట్ డా. కన్యాకుమారి 72 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో హైరిస్క్ గర్భిణీ స్త్రీలను 16 మందిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు, లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెల్త్ ఎడ్యుకేటర్ బి రామారావు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరైన గర్భిణీలకు ఎంపీహెచ్ ఈవో జిత్తుగ మల్లికార్జునుడు, అంగరకు చెందిన రాగం రామ చందర్రావు,లు ఏర్పాటు చేసిన పలు రకాల పండ్లు, బ్రెడ్స్, బిస్కెట్, అందజేశారు. అలాగే మాచరమట్టలు గ్రామానికి చెందిన కామ్రేడ్ జిత్తుగ వెంకన్న చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 మంది బోధ వ్యాధిగ్రస్తులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి డా గీతాంజలి, ఎంపి హెచ్ ఈ ఓ జె మల్లికార్జునుడు, టి.ర్ర మేరీమణి, ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు,గర్భిణీలు పాల్గొన్నారు.

➡️