ఉద్యోగాలు లేకపోతే యువత భవిష్యత్తు నాశనమైపోతుంది : టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు

ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు ఉద్యోగాలు లేకపోతే వారి భవిష్యత్తు నాశనమై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని విజయనగరం టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు అన్నారు. మంగళవారం అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియావారికి ఆహ్వానం వీy ఖీఱతీర్‌ Vశ్‌ీవ ఖీశీతీ జదీచీ కార్యక్రమం నిరుద్యోగ యువతతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా యువత మాట్లాడుతూ … మై ఫస్ట్‌ వర్డ్‌ ఫర్‌ సిబిఎన్‌ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌ ఎక్కువగా తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించిన నాయకుడు చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి నుండి మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు యువత ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరి ఏ ఇతర ఉద్యోగాలు తీయలేదన్నారు. యువత ఎప్పుడూ ఎదురుచూసేది ఉద్యోగ అవకాశాల కోసమే అన్నారు. చంద్రబాబు అయితే ఇటు రాష్ట్ర అభివఅద్ధి అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వస్తారన్నారు యువతకు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువత భవిష్యత్తు ఉద్యోగాల వైపు వెళుతుందని ఆశించారు. అదితి గజపతిరాజు మాట్లాడుతూ … రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, ఇప్పటికీ ఆరు లక్షల 12 వేల మంది నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉన్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. గవర్నమెంట్‌ ప్రైవేటు ఉద్యోగాలు లేవు యువత కలల కన్నా భవిష్యత్తును అందుకోలేకపోతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ ప్రభావం ఎక్కువైపోయిందని, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని , వారి భవిష్యత్తు ఎటు వెళుతుందని ఆందోళన చెందుతున్నారు అన్నారు. సిఎం జగన్‌ ఇంతవరకు ఒక జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదన్నారు. అదే చంద్రబాబు నాయుడు టైంలో అయితే ఐటీ హబ్‌, అనేక రకాల పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గా ఉన్నప్పుడు విజన్‌ 2020 గా పెట్టుకుని హైదరాబాదును ప్రపంచ స్థాయిలో నిలబెట్టారన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన మన రాష్ట్రానికి విజన్‌ 2047 గా పెట్టుకున్నారు ఆయన గనక రాష్ట్రానికి సిఎం అయితే ఆయన విజన్లు కొనసాగించి రాష్ట్ర రూపురేఖలు మారుస్తూ యువతకు బంగారు భవిష్యత్తును అందిస్తారన్నారు.

➡️