అధికారంలోకి వస్తే ‘అన్నమయ్య’ను పూర్తి చేస్తాం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో సిద్ధం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛ ప్రాజెక్టు ఇప్పటికే 90 శాతం పూర్తయిందని తెలిపారు. తాము మరల అధికారంలోకి రాగానే గాలేరు-నగరి ప్రాజెక్టును రైల్వేకోడూరు వరకు తీసుకొస్తామన్నారు. టిడిపి, జనసేన, బిజెపిలవి పెత్తందారుల కూటమి అని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో ప్రజలకు చేసింది శూన్యమని పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి బాబు ఎన్ని అబద్దాలైనా చెబుతాడని, ఆయనో మాయగాడని, 2014లో ముఖ్యమైన హామీలతో కూడిన కరపత్రాలుపై బాబు సంతకం చేసి ప్రజలను నమ్మించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంచుతూనే మదనపల్లి, రాజంపేటలను జిల్లా కేంద్రాలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. 59 నెలల పారిపాలనలో వివక్షకు తావు లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా సుపరిపాలన అందించామని తెలిపారు. ఈ సంక్షేమం ఇలానే కొనసాగాలంటే తమకు మళ్లీ అధికారం ఇచ్చి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పేదల ఇంగ్లీష్‌ మీడియం చదువులను చంద్రబాబు ఓర్చుకోలేకపోయారని ఆరోపించారు. ఇంగ్లీషు మీడియం చదువులను వ్యతిరేకించినవారు తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కలిగించామని, ఆరవ తరగతిలో డిజిటల్‌ బోధన, ఎనిమిదవ తరగతిలో ట్యాబులు, మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, విద్యా కానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేదల పెద్ద చదువుల కోసం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆసరా, సున్నా వడ్డీ పథకం వైయస్సార్‌ చేయూత, కాపు, ఈబిసి నేస్తాలు వంటి పథకాలు ఇవ్వడంతో పాటు మహిళల రక్షణ కోసం మహిళా పోలీసు, దిశా యాప్‌ ఏర్పాటు చేసి అక్క చెల్లెమ్మల అభ్యున్నతి కోసం వైసిపి పాటుపడిందని తెలిపారు. రాష్ట్రంలో గూడులేని పేదలే ఉండకూడదన్న సత్సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి అందించామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. స్వయం ఉపాధికి వైయస్సార్‌ వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం ఇచ్చామని, పేదవారి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ రూ 25 లక్షలకు పెంచామని, శాస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆరోగ్య ఆసరా ఇస్తున్నామని, విలేజ్‌ క్లినిక్‌లు, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజలకు వైద్యం అందిస్తూ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 600 రకాల పౌర సేవలు అందించే సచివాలయాలు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కలిగించామని, ఆరవ తరగతిలో డిజిటల్‌ బోధన, ఎనిమిదవ తరగతిలో ట్యాబులు, మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, విద్యా కానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేదల పెద్ద చదువుల కోసం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆసరా, సున్నా వడ్డీ పథకం వైయస్సార్‌ చేయూత, కాపు, ఈబిసి నేస్తాలు వంటి పథకాలు ఇవ్వడంతో పాటు మహిళల రక్షణ కోసం మహిళా పోలీసు, దిశా యాప్‌ ఏర్పాటు చేసి అక్క చెల్లెమ్మల అభ్యున్నతి కోసం వైసిపి పాటుపడిందని తెలిపారు. రాష్ట్రంలో గూడులేని పేదలే ఉండకూడదన్న సత్సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి అందించామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. స్వయం ఉపాధికి వైయస్సార్‌ వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం ఇచ్చామని, పేదవారి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ రూ 25 లక్షలకు పెంచామని, శాస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆరోగ్య ఆసరా ఇస్తున్నామని, విలేజ్‌ క్లినిక్‌లు, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజలకు వైద్యం అందిస్తూ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. 600 రకాల పౌర సేవలు అందించే సచివాలయాలు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️