ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జేడీఏ

Nov 28,2023 15:01 #Kakinada

ప్రజాశక్తి -కరప (కాకినాడ) : జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్ కుమార్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలనలో భాగంగా కరప మండలంలో పాతర్లగడ్డ గ్రామంలో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌ మిల్లును సందర్శించి ఈ సంవత్సరం నుండి అమలుచేసిన జి.పి.యన్‌ విధానం పనితీరు, అమలు చేయుచున్న విధానం వాటిని పని విధానాన్ని పరిశీలించారు. అనంతరం రైతుల కల్లాలు వద్దకి వెళ్ళి ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర, నాణ్యత ప్రమాణాలు మొదలయిన వాటి పై వారితో మాట్లాడారు. రబీ 2023-24 పంటకాలనికి సన్నద్ధం కావాలని, నారుమడ్లు, వెదలు 10-12-2023, ఉడుపులు 31-12-2029 లోపు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కషి చేయాలని సూచించారు. అనంతరం ఫాతర్లగడ్డ (గ్రామంలో కేఎంజి కాలువను గ్రామ సర్పంచ్‌ నాగిరెడ్డి ఏసుబాబు తో కలిసి పరిశీలించారు. కాలువలో ఎక్కువగా తూటికాడ, గుర్రపుడెక్క ఎక్కువగా ఉన్నాయని.. దాళ్వా సమయానికి నీటికి ఇబ్బంది అవుతుంది అని రైతుల విజ్ఞప్తి మేరకు సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో తగు చర్యలు నిమిత్తం మాట్లాడి అధికారులకు పలుసూచన చేశారు. ఈ కార్యక్రమంలోకరప సబ్‌ డివిజన్‌ ఎ.డి.ఎ. కే.బాబురావు , మండల వ్యవసాయ అధికారి వి.వి.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️