బండారు నామినేషన్‌కు కదిలిన ఉమ్మడి పార్టీ శ్రేణులు

Apr 24,2024 11:38 #Bandaru, #nomination

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : బుధవారం ఉదయం 09:00 గంటలకు మండల పరిధి 18 గ్రామాల నుంచి వాడపాలెం బండారు నివాసం వద్ద చేరి, పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గనేందుకు టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ హాజరై ఆశీర్వదించ వలసినదిగా టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి కోరారు.

➡️