కడప స్టీల్‌ప్లాంట్‌ వైఎస్‌ఆర్‌ కల

ప్రజాశక్తి-చక్రాయపేట/వేంపల్లె కడప స్టీల్‌ప్లాంట్‌ వైఎస్‌ఆర్‌ కల అని, వైఎస్‌.జగన్‌ ఆ ప్రాజెక్టును కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేశారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌. షర్మిల పేర్కొన్నారు. బుధవారం ఆమె చక్రాయపేట, వేంపల్లె మం డలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్‌ తన అన్న కాబట్టి ఎన్నికల్లో ఇచ్చే డబ్బు అంతా తన గెలుపుకోసమే ఇస్తున్నారని పేరొ ్కన్నారు. అందరూ ఆ డబ్బు తీసుకుని తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపిం చాలని కోరారు. ఎంపీ అవి నాష్‌రడ్డి ఏనాడైనా జిల్లా ప్రజల కోసం పని చేశారా అని ప్రశ్నించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ జిల్లాకు వచ్చి ఉంటే జిల్లా నిరు ద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు. ఎంపీగా అవినాష్‌ రెడ్డికి స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై బాధ్యత లేదా అన్నారు. ఒక రోజు కూడ పార్లమెంట్‌ లో పోరాటం చేయలేదని చెప్పారు. సిబిఐ కేసులకు తప్పా ఎంపీ అవినాష్‌ రెడ్డి ఢిల్లీకి పోరని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ కడప స్టీల్‌ శంకుస్థాపన ప్రాజెక్ట్‌గా మార్చారని చెప్పారు. సొంత నియోజక వర్గంలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పారు. పులివెందుల మైక్రో ఇరిగేషన్‌ పథకం అన్నారే తప్ప తట్టెడు మట్టి తీయలేదని వాపోయారు. గండికోట రిజర్వాయర్‌ 365 రోజులు నీళ్ళు ఉండేలా చూస్తా అని చెప్పి ఒక్క హామీ నెరవేరలేదని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్ట్‌లు కట్టారని చెప్పారు. పెండింగ్‌ లో ఉన్న 42 ప్రాజెక్ట్‌లకు వారసుడైన జగన్‌ పాలనలో దిక్కులేదని విమర్శించారు. ఐదేళ్లు సిఎంగా ఉండీ ఎంతో చేయాలని, కనీసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అని నిరుద్యోగులను మోసం చేశారని వాపోయారు. వైఎస్‌ఆర్‌కు, జగన్‌కు పొంతనే లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అన్నారు. 5 ఏళ్లలో జగన్‌ శంకుస్థాపనలు చేయడం తప్పా ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మద్య నిషేధం అని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేఢారు. జగన్‌ ఏ బ్రాండ్‌ అమ్మితే అదే కొనాలని విమర్శించారు. మద్యం అమ్మకాల పేరుతో మాఫీయా రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. వివేకా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడని.. ఆయన్ను హత్య చేస్తే ఈ రోజు వరకు సమాధానం లేదని చెప్పారు. సిబిఐ విచారణ అంటే జగన్‌ కి ఎందుకు భయం అన్నారు. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదని వాపోయారు. ఐదేళ్లు పోరాటం చేస్తున్నా న్యాయం లేదని అన్నారు. ప్రజా కోర్టులో న్యాయం కోసం వచ్చామని.. మీ ఆడబిడ్డలుగా అడుగుతున్నా న్యాయం చేయండి అని ఆమె ప్రజలను వేడుకున్నారు. కొంగు చాపి న్యాయం అడుగుతున్నాం న్యాయం చేయండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కోరారు. ఈనెల 13న నిర్వహించబోయే ఎన్నికల్లో కడప ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా ధవకుమార్‌ రెడ్డిని గెలిపించేందుకు హస్తం గుర్తుకు రెండు సార్లు బటన్‌ నోక్కాలని షర్మిలా కోరారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, కాంగ్రెస్‌ నాయకులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. వర్గంలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పారు. పులివెందుల మైక్రో ఇరిగేషన్‌ పథకం అన్నారే తప్ప తట్టెడు మట్టి తీయలేదని వాపోయారు. గండికోట రిజర్వాయర్‌ 365 రోజులు నీళ్ళు ఉండేలా చూస్తా అని చెప్పి ఒక్క హామీ నెరవేరలేదని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్ట్‌లు కట్టారని చెప్పారు. పెండింగ్‌ లో ఉన్న 42 ప్రాజెక్ట్‌లకు వారసుడైన జగన్‌ పాలనలో దిక్కులేదని విమర్శించారు. ఐదేళ్లు సిఎంగా ఉండీ ఎంతో చేయాలని, కనీసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అని నిరుద్యోగులను మోసం చేశారని వాపోయారు. వైఎస్‌ఆర్‌కు, జగన్‌కు పొంతనే లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అన్నారు. 5 ఏళ్లలో జగన్‌ శంకుస్థాపనలు చేయడం తప్పా ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మద్య నిషేధం అని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేఢారు. జగన్‌ ఏ బ్రాండ్‌ అమ్మితే అదే కొనాలని విమర్శించారు. మద్యం అమ్మకాల పేరుతో మాఫీయా రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. వివేకా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడని.. ఆయన్ను హత్య చేస్తే ఈ రోజు వరకు సమాధానం లేదని చెప్పారు. సిబిఐ విచారణ అంటే జగన్‌ కి ఎందుకు భయం అన్నారు. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదని వాపోయారు. ఐదేళ్లు పోరాటం చేస్తున్నా న్యాయం లేదని అన్నారు. ప్రజా కోర్టులో న్యాయం కోసం వచ్చామని.. మీ ఆడబిడ్డలుగా అడుగుతున్నా న్యాయం చేయండి అని ఆమె ప్రజలను వేడుకున్నారు. కొంగు చాపి న్యాయం అడుగుతున్నాం న్యాయం చేయండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కోరారు. ఈనెల 13న నిర్వహించబోయే ఎన్నికల్లో కడప ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా ధవకుమార్‌ రెడ్డిని గెలిపించేందుకు హస్తం గుర్తుకు రెండు సార్లు బటన్‌ నోక్కాలని షర్మిలా కోరారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, కాంగ్రెస్‌ నాయకులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

➡️