అసూయ చెందేలా అభివృద్ధి పనులు : డిప్యూటీ సిఎం

ప్రజాశక్తి-కడప
గత ప్రభుత్వాలు, నాయకులు అసూయ చెందేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అభివద్ధి చేస్తున్నారని డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలంపల్లె, రూకవారిపల్లెలో స్థానిక కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్డు, 3 డ్రైన్‌ కాలువలకు ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా నగరాభివద్ధికి రూ.2400 కోట్లు కేటాయించి అభివద్ధి చేస్తున్నారని చెప్పారు. కడప నగరంలో అన్ని విధాల అభివద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి నిధులు, సహాయ సహకారాలు అందలేదని ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. గత ప్రభుత్వం జిల్లాను, కడప నగరాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పారు. 2019 సంవత్సరంలో వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక కడప నగరంలో అన్ని కూడళ్లను అభివద్ధి, సుంద్రీకరణ చేశారని, అలాగే రోడ్డు విస్తరణలు చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివద్ధిని ప్రజలు గమనించి మళ్లీ ు దీవెనలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మాసీమ బాబు, స్థానిక కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఇతర కార్పొరేటర్‌ షేక్‌ మొహమ్మద్‌ షఫీ, నాయకులు నారపరెడ్డి సుబ్బారెడ్డి, తోట కష్ణ, పాలంపల్లె శేఖర్‌, శీను, రమేష్‌ రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

➡️