ఎంపీ చేతిలో పీడీ కీలుబొమ్మ : టిడిపి

ప్రజాశక్తి- కడప అర్బన్‌
వైసిపి ఎంపీ అవినాష్‌ రెడ్డి చెప్పినట్లు డ్వామా పీడీ యదుభూషణ్‌ రెడ్డి ఆడుతున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్‌ అన్నారు. సోమవారం హరి టవర్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తేదీలు వేసి ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. పీడీ అవినీతి పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందించి పీడీ పై చర్యలు తీసుకోవాలని కోరారు. డ్వామా పీడీ ఎన్నికల కోడ్‌ను పాటించడం లేదని పేర్కొన్నారు. వైసిపి కోవర్ట్‌ యదుభూషణ్‌రెడ్డి అని ఆరోపించారు. కడపలో త్రీ స్టార్‌ పోలీసు ఉద్యోగి కనుసన్నల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. అశోక్‌ రెడ్డిని ఎన్నికల కు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దోచుకో దాచుకో అన్న చందంగా అశోక్‌ రెడ్డి వ్యవహార శైలి ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ అశోక్‌ రెడ్డి పై చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ కు సిఐ పై ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు పీరయ్య, జనార్ధన్‌, నాగరాజు పాల్గొన్నారు.

➡️