ఆశాలపై సర్కార్‌ నిర్బంధం

Feb 8,2024 22:59
తెల్లవారుజాము నుంచే

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ బుధవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ పోలీసులు ద్వారా ఆశల ఇళ్లకు వెళ్లి ఆటోలు ద్వారా స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లలో, బస్‌ స్టేషన్లలో సొంత వాహనాలు పెట్టుకుని వెళ్తున్న ఆశలను సైతం నిర్బంధించారు. ఉదయం ఏడు గంటలకు అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాల్లో, పోలీస్‌ స్టేషన్లో విజయవాడ వెళ్లే రైళ్లు వెళ్లిపోయేదాకా నిర్బంధించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడ సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు తాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశాలకు మధ్య తీవ్ర తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జిని, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి నొక్క లలిత, నాయకులు మలకా నాగలక్ష్మి, చెక్కల వేణిలను అరెస్టుచేసి స్థానిక 3టౌన్‌, 1టౌన్‌లకు తరలించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సుమారు 200 మంది ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. దీంతో అరెస్టు చేసిన నాయకత్వాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.రాజా, రొంగల ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దాపురం చలో విజయవాడకు వెళ్తున్న ఆశ వర్కర్లను సామర్లకోట రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి వారిని స్థానిక మున్సిపల్‌ సెంటర్లోని అంబేద్కర్‌ భవనంలో నిర్బంధించారు. దీంతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబేద్కర్‌ భవనం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు డి.క్రాంతి కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు లోవకుమారి, రమ ణమ్మ, రామలక్ష్మి, వెంకటలక్ష్మి, ప్రయివేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చింతల సత్యనారాయణ, పెయింటింగ్‌ వర్కర్‌ యూనియన్‌ నాయకులు గూనూరి వెంకటరమణ, వడ్డి సత్యనారా యణ, మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కరక సుబ్బలక్ష్మి, సత్యవతి, సిఐటియు నాయకులు ఎస్‌.శ్రీని వాస్‌, ప్రజా నాట్యమండలి నాయకులు దార పురెడ్డి కృష్ణ, కూనిరెడ్డి అప్పన్న తదితరులు పాల్గొ న్నారు. తాళ్లరేవు కాకినాడ, తాళ్లరేవు ప్రాంతాలకు చెందిన ఆశ కార్యకర్తలను కాకినాడ రైల్వే స్టేషన్‌, రామచంద్రపురం బస్టాండులో అరెస్టు చేసి కోరంగి పోలీస్‌ స్టేషన్‌కు తర లించారు. ఈ సందర్భంగా కోరంగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆశ వర్కర్లు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు ఆధ్వ ర్యంలో టిడిపి, జనసేన పార్టీ నాయకులు ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. ప్రజాసంఘాల ఆందోళనతో ఆశ కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డి.వెంకటరమణ, ఎ.బాబురావు, టి.లక్ష్మణరావు, వి.వీరబాబు, పి.రామలక్ష్మి,. ఎన్‌.వినోద్‌, ఎన్‌.మూర్తి, చౌదరి పాల్గొ న్నారు. కోటనందూరు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆశా కార్యకర్తలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నక్కల శ్రీనివాస్‌, ధనలక్ష్మి, నాగేశ్వరరావు, రమణ, సీతారత్నం, సంతోషి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️