ఘనంగా మహిళా దినోత్సవం

Mar 8,2024 22:12
ఘనంగా మహిళా దినోత్సవం

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లావ్యాప్తంగా శుక్రవారం మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ మేయర్‌, టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలను సన్మానించారు. అనంతరం వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ముందడుగు వేసి కలలకు రెక్కలు అనే పేరుతో సరికొత్త పథకం తీసుకు వచ్చారన్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవటానికి అర్హులన్నారు. నమోదు చేసుకున్న మహిళలు తీసుకొనే బ్యాంకు లోన్‌ ు తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ప్రభత్వం హామీ ఇస్తుందని, వడ్డీ కూడా ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి గుత్తుల సూర్యావతి, జిల్లా కార్యదర్శి బొందల రామ లక్ష్మి, బొందల లోకేశ్వరి, చెల్లా పార్వతి, సత్య, మహిళలు పాల్గొన్నారు.సామర్లకోట స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలని ప్రతి మహిళా ఆ దిశగా అభివద్ధి చెందాలని డిఆర్డిఎ పీడీ శ్రీ రమణి అన్నారు. జిల్లా మహిళా సాధికార సంస్థలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. పీడీ శ్రీరమణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉభయ తూర్పు గోదావరి జిల్లా లోని స్వయం సహాయక సంఘాలు అవలంభిస్తున్న స్వయం సమద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శం అన్నారు. తన ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా మహిళా దినోత్సవాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కమ్యూనిటీ, సిబ్బంది అయిన మహిళలను అభినందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది కమ్యూనిటీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విజయ గాధలున్న మహిళలకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని సిబ్బంది, కమ్యూనిటీ మహిళలకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. పలువురు మహిళా ప్రతినిధులకు సత్కార కార్యక్రమాలు చేపట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉభయ తూర్పు గోదావరి జిల్లాల సమాఖ్యల నాయకులు, డిఆర్‌డిఎ సిబ్బంది, డిపిఎంలు టి.బాబూరావు, విబిఆర్‌ రారు, వెంకటరావు, 20 మండలాల ఎపిఎంలు పాల్గొన్నారు.రాక్‌లో మహిళా దినోత్సవం రాక్‌ సిరామిక్స్‌ కంపెనీలో మహిలా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు అందరిని సత్కరించారు. మహిళలు అందరూ ఆరోగ్యం గా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ కల్లోల్‌ కుమార్‌ ఘోష్‌ అన్నారు. మెడికవర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ నవీన్‌ ఆరోగ్య చిట్కాలు, వడదెబ్బ, సిపిఆర్‌ టెక్నిక్స్‌ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కల్లోల్‌ కుమార్‌ ఘోష్‌, హెడ్‌ హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌ టి.నీరజ్‌కుమార్‌, సేఫ్టీ మేనేజర్‌ బాలాజీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ విజిఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు. రైల్వే స్టేషన్‌ ఆవరణలో రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో మహిళా సిబ్బందిని మేనేజర్‌ రమేష్‌, ఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ రామకష్ణ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు.ఏలేశ్వరం మహిళా సాధికారత టిడిపి జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని టిడిపి ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం ఆరో వార్డులో వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రభ విలేకరులతో మాట్లాడుతూ టిడిపి జనసేన మేనిఫెస్టోలో నూతనంగా ప్రవేశపెట్టిన పథకంతో మహిళ బ్యాంకు రుణం పొంది దేశంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపికి చెందిన మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.కరప అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పుడే మహిళ సాధికారత సాధ్యమవుతుందని జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళిఅన్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా టిడిపి, జనసేన పార్టీలు పని చేస్తాయని ఆయన తెలిపారు. పెనుగుదురులో రెడ్డిపల్లి భాస్కర్‌ ఇంటి వద్ద మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్దాపురప్పాడు, గురజానపల్లి, సిరిపురం ఎంపిటిసిలు పబ్బినీడి పద్మావతి, యండమూరి వీరవేణి, కె.ధనలక్ష్మి కేకును కోసి మహిళా నేతలకు పంపిణీ చేశారు. గంటా నానిబాబు, తుమ్మల సత్యనారాయణ, యాళ్ల హరినాథ్‌, పుష్పలత, బోగిరెడ్డి కొండబాబు, గంగాధర్‌, ముద్రగడ రమేష్‌, మెండు గోవిందు, ముత్యాలరావు పాల్గొన్నారు.

➡️