ఏప్రిల్ 8న కాకినాడలో అంబేడ్కర్ జీవిత నాటక ప్రదర్శన

Mar 29,2024 16:51 #Kakinada

సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరించిన ప్రజా సంఘాలు.

ప్రజాశక్తి-కాకినాడ : బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితం కృషి ని వివరిస్తూ హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ రూపొందించిన సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన ఏప్రిల్ 8 వ తేదీ సాయంత్రం సూర్యకళామందిరంలో ఏర్పాటు చేసినట్లు వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద నాటక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ ను అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణిలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పేరెన్నికగన్న నాయకుడని తెలిపారు. ఆయన బాల్యంలో, యవ్వనంలో పడిన కష్టాలు, దేశం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి, తపన ఈ నాటకం లో చూడవచ్చన్నారు. అంబేడ్కర్ కొందరివాడు కాదు అందరివాడని ఈ నాటకం చూస్తే అర్థమవుతుందన్నారు. సిఐటియు, యుటిఎఫ్, జెవివి, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాలు అన్నీ సంయుక్తంగా ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు అంబేడ్కర్ నాటక ప్రదర్శన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. రవి చక్రవర్తి, జెవివి జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు జిఎస్ వర్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కె. సత్తిరాజు, కోశాధికారి మలక వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి‌. రాజా, ఐద్వా నగర కార్యదర్శి కె. నాగజ్యోతి, కెవిపిఎస్ నగర నాయకులు కటారి పద్మనాభం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.జి.సూరిబాబు, నగర అధ్యక్షుడు ఎ. సంజయ్, శ్రామిక మహిళా నేతలు చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి , ఈ. చంద్రావతి, సిహెచ్. వేణు, డివైఎఫ్ఐ నాయకులు పి. దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️