ప్రజాస్వామ్య ప్రగతి ఓటుతోనే సాధ్యం

May 6,2024 23:09
ప్రజాస్వామ్య ప్రగతి ఓటుతోనే సాధ్యమని,

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

ప్రజాస్వామ్య ప్రగతి ఓటుతోనే సాధ్యమని, అందుకు అనుగుణంగానే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరు తన ఓటును వినియోగించుకోవాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఆర్‌ఒ ఇట్ల కిషోర్‌ పిలుపునిచ్చారు. పౌర సంక్షేమ సంఘం చేపట్టిన ఓటరు చైతన్య కరపత్రాలను నన్నయ్య యూనివర్శిటీ క్యాంపస్‌లో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్‌ ప్రాంతాల ఓటర్లు మే 13న జరిగే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని పొలింగ్‌ శాతం పెంపు చేయాలన్నారు. పౌర సంఘం కన్వీనర్‌ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 80 శాతం పైగా ఉండే పొలింగ్‌ శాతం 65 శాతానికి తగ్గిపోవడం ఆందోళనకరమన్నారు. పోటీ చేసే అభ్యర్థులలో ఒకరికి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను బలపర్చాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉంటే నోటాకు ఓటు వేయాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికల వ్యవస్థను గౌరవించాలని కోరారు. 8 నుంచి 11 వరకు నాలుగు రోజులు పాటు కాకినాడ సిటీ రూరల్‌లో ఓటు హక్కు వినియోగంపై ఓటరు చైతన్య మైకు ప్రచార యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రచారాలకు తావు లేకుండా నిర్వహించే స్వచ్ఛంద ఓటరు చైతన్య మైకు ప్రచారానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదని కిషోర్‌ తెలిపారు.

➡️