ఓటు హక్కు వినియోగించుకోండి

Apr 23,2024 22:39
ఓటు హక్కు ఉన్న ప్రతి

ప్రజాశక్తి – సామర్లకోట

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ (ఎంసిసి)కన్వీనర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాస్తి రామారావు పిలుపునిచ్చారు.. బుధవారం పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో, మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు వేసి ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన పోలింగ్‌ శాతాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివా సరావు, మున్సిపల్‌ ఎఎస్‌ఓ పెంకె శ్రీనివాసరావు, విఆర్‌ఒలు నల్లజర్ల మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️