ప్రజల సహకారం అవసరం

Apr 9,2024 23:27
ప్రశాంత వాతావరణంలో

ప్రజాశక్తి – పిఠాపురం

ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్ని కలు జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని పట్టణ ఎస్‌ఐ ఆర్‌.మురళీమోహన్‌ కోరారు. మంగళవారం స్థానిక అగ్రహారంలోని ఇందిరానగర్‌, మిరపకాయల వీధిలో కేంద్ర పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు కవాతు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ లకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీస్‌ బల గాల భద్రత భరోసాగా ఉంటాయని అన్నారు. ఎన్నికలు ప్రశాంత యుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరిం చాలని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనన్నారు. నిర్భయంగా ప్రజలం దరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

➡️