ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం: నాగబాబు

Apr 28,2024 22:51
ఆధ్యాత్మిక రాజధానిగా

ప్రజాశక్తి – పిఠాపురం

ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురంను అభివృద్ధి చేయడం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. మండలంలోని విరవాడ రోడ్డులో బ్రాహ్మణ అగ్రహారంలో ఆదివారం జరిగిన లక్ష్మీగణపతి హోమం పూజా కార్యక్రమాల్లో ఆయన సతీమణి పద్మతోపాటు కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వేదపండితులు, అర్చకులు, బ్రాహ్మణులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్‌ ఎంఎల్‌ఎగా నెగ్గితే పిఠాపురంను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేస్తారని అన్నారు. నేడు బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు సులభతరంగా పరిష్కరించొచ్చని, కానీ వాటిని పాలకులు పెడచెవిన పెడుతున్నారన్నారు. దేవస్థానాలపై దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు ముందుకు వచ్చి ఖండించిన దాఖలాలు లేవని, వైసిపి నాయకులు దేవాలయాలపై దాడులు ఘటన చాలా తేలికగా తీసుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజం అభ్యున్నతి కోసం ముఖ్యంగా పిఠాపురంలో బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణ సమాజం అభ్యున్నతి కోసం బ్రాహ్మణులంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజరు, జబర్దస్త్‌ ఫ్రేమ్‌ రాకెట్‌ రాఘవ, తోలేటి శిరీష, స్థానిక బ్రహ్మణులు పోక్కులూరి రాజా, వై.సూర్యనారాయణ, ఫణి, భార్గవశర్మ, ఇంద్రగంటి సోమయాజులు పాల్గొన్నారు.

➡️