చిన్నారులకు పల్స్‌ పోలియో తప్పనిసరి

Feb 23,2024 16:05

సమావేశములో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర

ప్రజాశక్తి-అమలాపురం

చిన్నారులకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ నందు పల్స్‌ పోలియో నిర్వహణపై జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం డిఎంహెచ్‌ఓ అధ్యక్షతన లైన్‌ డిపార్ట్మెంట్‌ అధికారులతో నిర్వహించి మార్చి 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్‌ పోలియో మాపప్‌ కార్యక్రమం నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనదేశంలో పల్స్‌ పోలియో కేసులు నమోదు కానప్పటికీ సరిహద్దు దేశాలలో కేసులు నమోదవుతున్న దష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పల్స్‌ పోలియో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఆ మేరకు ఈ పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా1,45,318 మంది 0-5 పిల్లలను లక్ష్యంగా నిర్దేశించి మార్చి 3న బూత్‌ స్థాయిలో 983 కేంద్రాలు 1,850 టీములు, 27 ట్రాన్సిట్‌ పాయింట్లు, ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మార్చి4, 5 తేదీల్లో బూల్‌ స్థాయి లో వేయగా మిగిలిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి 52 మొ బైల్‌ టీమ్లు చుక్కల మందు వేస్తా యన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు బూత్‌ స్థాయి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇటుక బట్టీలు మత్స్యకార ఆవాసాలు, మురికి వాడలను అవుట్‌ రీచ్‌ ప్రాంతాలైన బైరవ పాలెం వంటి ప్రాంతాల్లో ట్రాన్సిట్‌ మొబైల్‌ బందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి లైన్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని కోరారు. గ్రామస్థాయిలో విఆర్‌ఒలు, మండల స్థాయిలో ఎంపిడిఒ లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సమన్వయం వహించాలని కోరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి డిఐపిఆర్‌ ఒ ామస్థాయిలో ముందుగా అవగాహన ర్యాలీలు ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కార్యక్రమం పై అవగాహన పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ బివి.సత్యనారాయణ, ఐసిడిఎస్‌ పీడీ ఎం.ఝాన్సీ లక్ష్మి, డిఇఒ ఎం.కమలకుమారి, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జ్యోతిలక్ష్మీదేవి, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సుమలత, ఆర్‌ బి ఎస్‌కె కోఆర్డినేట్‌ జాన్‌ లేవి, బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వై.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

➡️