నేలవాలిన చేలు.. తడిచిన ధాన్యం

May 8,2024 23:14

కుందూరులో దెబ్బతిన్న చేలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

ప్రజాశక్తి-యంత్రాంగం

డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పండ్ల, కూరగాయల తోటలు, పంట చేలు దెబ్బతిన్నాయి. ధాన్యంరాశులు తడిచి పోయా యి. దెబ్బతిన్న కూరగాయల తోటలను ప్రజాప్రతిని ధులు, నాయకులు, పంట చేలను, తడిచిన ధాన్యం రాశులను వ్యవసాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. రామచంద్రపురం : మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు రైతులకు నష్టం వాటిల్లింది. కె.గంగవరం మండలంలోని పామర్రు హై స్కూల్‌ గ్రౌండ్‌లో నిల్వ చేసుకున్న ధాన్యం రాశులు నీట మునిగాయి. దీంతో బుధవారం రైతులంతా నీటిని బయటకు దింపుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మండలంలో ఇప్పటివరకు 80 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. పలుచేట్ల చేలు నేలకొరిగాయి. దెబ్బతిన్న చేలను జిల్లా వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ అధికారులు బుధవారం కె. గంగవరం మండలంలో పర్యటించారు. డిడిఎ జ్యోతిర్మయి, ఎడిఎ రాజశేఖర్‌, ఏరువాక కోఆర్డినేటర్‌ నందకిషోర్‌, మండల వ్యవసాయ అధికారి బలుసు రవి నీట మునిగిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులు వెంటనే నీటిని దింపుకోవాలని తడిసిన ధాన్యాన్ని బయటకు తెచ్చుకుని ఉప్పు వరి ఊక చల్లుకుని పంటను కాపాడుకోవచ్చని, అదేవిధంగా రైతులంతా 17 తేమశాతం వరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి అన్నారు. నేలకొరిగిన వరి చేలపై ఉప్పు చల్లుకోవడం ద్వారా మనకు రాకుండా చూసుకోవచ్చు అని వారు వివరించారు. అదేవిధంగా బాగా తడిసిన ధాన్యానికి ఒక ఉప్పు, ఎండు గడ్డితో కలిపి నిల్వ చేసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుందని వారు తెలిపారు. మరో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సిద్ధం చేసుకుని రాశులపై కప్పుకోవాలని సూచించారు. మండలంలోని కుందూరు, శివల, దంగేరు, కుడుపూరు గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించి తడిసిన ధాన్యాన్ని పరీక్షించారు రైతులతో మాట్లాడి అధైర్య పడవద్దు అని సూచించారు మంగళవారం కురిసిన భారీ వర్షానికి తామరపల్లి గ్రామానికి చెందిన పెంకే చంద్రమ్మ పెంకుటిల్లు నేలమట్టమయింది. ఈదురు గాలులు, భారీ వర్షానికి కుప్పకూలింది. అయితే ప్రాణనాష్టమేమి జరగలేదు. కూలినయించిన తామరపల్లి సర్పంచ్‌ తోకలమంగా శ్రీనివాస్‌ బుధవారం పరిశీలించారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌ దష్టికి తీసుకు వెళ్ళమని అధికారులు వెంటనే స్పందించి బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చాగల్లు : చాగల్లు మండలం లో మంగళవారం ఈదురుగాలుల వలన అరటి తోటలు విరిగిపోయాయని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గారపాటి సుబ్బారావు బుధవారం విరిగిన అరటి తోటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అరటి తోటలు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో మంచన్‌ తుఫాను వలన నష్టపోయిన అరటి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదని మరలా గాలి వాన వల్ల నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం నాయకులు గుత్తుల శ్రీను చెరుకూరు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం : భారీ వర్షం మరియు ఈదురుగాలులకు పంట పొలాల్లోని దాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రైతులు బుధవారం తడిసిన ధాన్యాన్ని ధాన్యపు బస్తాలను ఆరబెట్టుకుని పనిలో నిమగమే ఉన్నారు. ధాన్యము పట్టి వారం రోజులైనా వ్యవసాయ శాఖ సిబ్బంది మిల్లులకు తరలించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బికెలకు వెళ్లి అడు గుతుంటే వారు చెప్పే సమాధానానికి పొంతన ఉండటం లేదంటూ రైతులు చెబుతున్నారు. ఉన్నతాది óకారులు మాత్రం గోనె సంచుల్లో పట్టిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలిస్తున్నామంటూ వ్యవసాయ సిబ్బంది చెబుతున్నారు.

 

➡️