అకాల వర్షంతో అవస్థలు

May 12,2024 22:47
అకాల వర్షంతో అవస్థలు

ప్రజాశక్తి – కొత్తపేట కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌ సిబ్బంది కొత్తపేట హైస్కూల్‌ గ్రౌండ్‌ వద్ద ఇవిఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. హఠాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకు వెళ్లేందుకు పోలింగ్‌ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి మోకాళ్ళ లోతు నీరు బురద గ్రౌండ్‌లోకి చేరడంతో ఇచ్చిన సామగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు. గ్రౌండ్‌లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో జెసిబిల సాయంతో వాటిని ముందుకు కదిలించారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

➡️