ఎస్‌సి వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశం

Jun 29,2024 23:45

సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు బాబురావు

ప్రజాశక్తి-అమలాపురం

ఎస్‌సి వర్గీకరణకు వ్యతిరేకంగా అమలాపురం ప్రెస్‌ క్లబ్‌ లో మాల మహానాడు నాయకులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వర్గీకరణకు సంబంధించి పలు అంశాలు వెల్లడించారు. ఎస్‌సి వర్గీకరణకు వ్యతిరేకం అని ప్రముఖ దళిత నాయకులు జంగా బాబురావు అన్నారు. ఎస్‌సి వర్గీకరణ చట్టబద్ధం కాదని ఇదే విషయం సుప్రీం కోర్టు గతంలో తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో మొదటి సమావేశంలో ఎస్‌సి వర్గీకరణ చేసి తీరుతాం అని ప్రకటించారన్నారు. కానీ అంబేద్కర్‌ ఆలోచనా విధానం దళితులు ఐక్యంగా ఉండలన్నదే కానీ వర్గీకరణ చేయడం అంటే దళితుల ఐక్యత ను దెబ్బతీయడమే అని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అన్ని దళితుల మధ్య వైరాన్నే లక్ష్యంగా పార్టీలు చూస్తున్నాయనీ 15 శాతం ఎస్‌సిలకు, 7 శాతం ఎస్‌టిలకు రిజర్వేషన్‌ ఇచ్చారు. కానీ ఇప్పుడు జనాభా బాగా పెరిగింది రిజర్వేషన్లు పెంచాలి తప్ప వర్గీకరణ కాదు అని అన్నారు. వర్గీకరణ చెల్లదని చట్టం చెబుతుంది అని తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోడీ కూడా వర్గీకరణకు సానుకూలంగా ప్రకటన చేశారని అదే జరిగితే దళిత నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని అన్నారు. వర్గీకరణ అంశము కేవలం పొలిటికల్‌ స్టంట్‌ మాత్రమే దీన్ని ఆసరాగా చేసుకుని పార్టీలు లబ్ధి పొందేందుకే కానీ ఇవేమి అమలు జరిగేవికావని ప్రముఖ దళిత నాయకులు డిబి.లోక్‌ అన్నారు. ఇసుకపట్ల రఘుబాబు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దళిత నాయకులు పాల్గొన్నారు.

 

➡️