ఎపి సెట్‌ పరీక్షా కేంద్రాల్లో విసి పరిశీలన

Apr 28,2024 23:10
ఎపి సెట్‌ పరీక్షా కేంద్రాల్లో విసి పరిశీలన

ప్రజాశక్తి-రాజానగరం రాజమహేంద్రవరం పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ పరీక్షా కేంద్రాలను నన్నయ యూనివర్శిటీ విసి ఆచార్య కె.పద్మరాజు ఆదివారం పరిశీలించారు. రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిటి, ఎస్‌కె ఉమెన్స్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందించారు. దీనికి సంబంధించిన వివరాలను విసి తెలియజేశారు. రాజమహేంద్రవరం పరిధిలో 6,854 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. రాజమహేంద్రవరం రీజినల్‌ పరిధిలోని 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, అబ్జర్వర్స్‌ పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఆచార్య వై శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి పాల్గొన్నారు. ఎపి సెట్‌కు 724 మంది విద్యార్థుల హాజరుగోదావరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ గైట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎపి సెట్‌ పరీక్షా కేంద్రంలో 724 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.జయానంద కుమార్‌ తెలిపారు. గైట్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి 900 అభ్యర్థులను కేటాయించగా

➡️