13న ఎల్.ఐ.సి మెగా బిజినెస్ డే 

Mar 9,2024 15:31 #Krishna district

ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎల్.ఐ.సిలో నూతన వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడంలో భాగంగా, “మై ఎల్ ఐ సి, మై ఫ్రెండ్ అనే నినాదంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) మార్చి 13వ తేదీన ‘మెగా బిజినెస్ డే’ను పాటించాలని దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగిందని ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి. కిషోర్ కుమార్ పేర్కొన్నారు. మెగా బిజినెస్ ను జయప్రదం చేయడంలో భాగంగా శనివారం ఎల్ ఐ సి, డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏజెంట్ మిత్రులకు ఫోన్స్ చేసి నూతన వ్యాపారాన్ని సేకరించేలా ప్రోత్సహించడం, ఏజెంట్తో మీటింగ్స్ నిర్వహించడం, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులను నూతన పాలసీలు తీసుకునేలా సంప్రదించడం, గోడపత్రిక ఆవిష్కరణ, కరపత్రాల పంపణీ వంటి ప్రచార కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహించడం  జరుగుతోందన్నారు. ఎల్ఐసి ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ధనవృద్ధి, జీవన్ ఉత్సవ్, జీవన్ కిరణ్, అమృత్ బాల్, ఇండెక్స్ ప్లస్ వంటి నూతన పథకాలను గురించి ప్రజానీకంలో విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతోందని, ప్రజల పొదుపును సురక్షితమైన నమ్మకమైన ప్రభుత్వరంగ ఎల్ ఐ సి పథకాలలో పెట్టుబడిగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనదన్నారు. ఎల్ఐసి నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలు అన్ని వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఆకర్షణీయంగా ఉండడం వలన ఇప్పటికే వీటికి మంచి ప్రజాదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో మెగా బిజినెస్ కు అపూర్వ స్పందన లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నమన్నారు.ఎల్ ఐ సిసౌత్ సెంట్రల్ జోన్లో ఒక్కరోజులోనే లక్ష పాలసీలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, మచిలీపట్నం డివిజన్ లో 5 వేలు పాలసీలను మార్చి 13వ తేదీ ఒక్క రోజులోనే సేకరించడానికి జరుగుతున్న ఈ ప్రయత్నానికి పాలసీదారులు, ఏజెంట్ మిత్రులు, ప్రజానీకం సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.సుధాకర్, టి.చంద్రపాల్, ఎల్.రాజశేఖర్, బి. శ్రీనివాస్, ఎస్.వి.రత్నారావు, ఎ.శ్రీనివాసరావు, బిహెచ్. మాధుర్, వై.స్వామినాథ్. పి.నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️