ఆధునిక ఉత్పత్తులతో రైతులకు మరింత చేరువ

Apr 11,2024 22:40
  • ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాహుల్‌

ప్రజాశక్తి-గన్నవరం

భారతీయ రైతుల సేవలో ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ లిమిటెడ్‌ 55 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఆధునిక ఉత్పత్తులతో మరింత చేరువ అవుతుందని ఆ కంపెనీ చైర్మన్‌ డాక్టర్‌ రాహుల్‌ తెలిపారు. గన్నవరం ఎస్‌ఎం కన్వెన్షన్‌ లో ఏపీ, ఒరిస్సాలకు చెందిన కంపెనీ డీలర్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఏరీస్‌ ఆగ్రో లిమిటెడ్‌ డీలర్స్‌ బ్రేనింగ్‌ ప్రొగ్రాం ఎమరాల్డ్‌ జూబ్లీ సందర్భంగా 500 మంది డీలర్లకు అనేక కొత్త అగ్రిటిక్‌, పంట పోషణ కార్యక్రమాలను తెలిపారు. డాక్టర్‌ రాహుల్‌ మాట్లాడుతూ భారతదేశంలోని స్పెషాలిటీ మైక్రోన్యూట్రియెంట్‌ అతిపెద్ద తయారీదారు ఏరిస్‌ ఆగ్రో లిమిటెడ్‌ డీలర్ల నుండి భాగస్వామ్యాన్ని పొందారన్నారు. కంపెనీ పురోగతిని రాబోయే ఉత్పత్తుల ప్రణాళికలను ఆవిష్కరించడానికి వేదికగా ఉపయోగపడిందని చెప్పారు. భారతీయ రైతుల సేవలో 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తన ఎమరాల్డ్‌ జూబ్లీని జరుపుకుంటోందని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్‌, దక్షిణ ఒరిస్సా ప్రాంతాలలోని డీలర్లు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యత, సుస్ధిరత, కస్టమర్‌ సంతప్తి పట్ల కంపెనీ నిబద్ధత గురించి హాజరైన వారికి వివరించారు. పంట దిగుబడిని పెంచడానికి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను ఆప్టిమైజ్‌ చేయడానికి రూపొందించిన అత్యాధునిక వ్యవసాయ ఇత్పత్తులను పరిచయం చేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఏరిన్‌ ఆగ్రో లిమిటెడ్‌ ప్రతిష్టాత్మక ప్రణాళికలను ఆవిష్కరించడంలో, రాబోయే ఉత్పత్తుల కీలక చర్చలు జరిగాయి. డీలర్లు అధిక సాంద్రత కలిగిన నీటిలో కరిగే ఎన్పీకే పంట పోషకాలు, 30 పురుగుమందులు, ఎరువుల శ్రేణి గురించి ప్రత్యక్షంగా తెలుసుకొనే వీలు కల్పించారు.భారతదేశంలో అతిపెద్ద తయారీ కంపెనీ మెడ్‌ ఇన్‌ ఇండియా మైక్రోన్యూట్రియెంట్స్‌, స్పెషాలిటీ క్రాప్‌ న్యూట్రిషన్‌ ప్రొడక్ట్స్‌, ఏరిస్‌ ఆగ్రో ఆవిష్కరణలో ముందంజలో ఉందని ప్రతినిధులు చెప్పారు. 130 ప్రపంచ స్థాయి బ్రాండ్లతో, ఏరిస్‌ ఆగ్రో మా ”ప్రొద్ది మెడ్‌’తో 100కి పైగా పంటల వ్యవసాయ ఉత్పాదకతను, 1.90 లక్షల గ్రామాల్లోని రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తోందన్నారు.

➡️