ఆన్లైన్ మస్టర్ విధానం రద్దు చేయాలి

Apr 8,2024 16:26 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి :  ఉపాధి హామీ పథకం కూలీలకు ఆన్లైన్ మస్టర్డ్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొవ్వ మండల పరిధిలోని అవిరి పూడిలో ఉపాధి పనులను పరిశీలించిన ఆయన కూలీల సమస్యపై స్పందించారు. ప్రభుత్వం కూలీలకు ఏర్పాటు చేయవలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకపోవతో ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రాంతంలో కూలీలకు తాగునీరు, మజ్జిగ, టెంట్ ఏర్పాటు చేయవలసి ఉన్న మండలంలో ఎక్కడ ఏర్పాటు చేసిన డాకలాస లు ఎక్కడ కానరావడం లేదని ఆరోపించారు. మండుటెండలో వడగాల్పులు వీస్తున్న కూలీలు పని చేస్తున్న తీరును చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోజువారి వేతనం 300 రూపాయలు ఇవ్వాల్సిన 260 నుండి270 రూపాయల కన్నా ఎక్కువ కూలీలకు రావటం లేదని కూలీలు చెప్పి నట్లు తెలిపారు. నెట్ అనుకూలంగా లేకపోవడంతో పని ప్రాంతం నుండి వేరే ప్రాంతంలోకి వెళ్లి మస్టర్ వేయించుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి ఫోటోలు తీసే, మస్టర్ వేసే వరకు ఉండటం వలన కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పని ప్రాంతంలోనే మేట్లు మస్టర్ వేయు విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పని ప్రాంతంలో కూలీలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

➡️