ఆస్పరిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

Jan 13,2024 19:50

మాట్లాడుతున్న మండల సమితి సభ్యులకు రామకృష్ణ

ప్రజాశక్తి – ఆస్పరి
సంక్రాంతి పండగ సందర్భంగా ఆస్పరిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆస్పరి సేవా సమితి కమిటీ సభ్యులు రామకృష్ణ, మహేష్‌, నరసింహులు, అరవింద్‌ తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. కబడ్డీ పోటీల్లో పాల్గొనే జట్లు రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గెలిచిన జట్లకు మొదటి బహుమతి రూ.20,116, రెండో బహుమతి రూ.10,116, మూడో బహుమతి రూ.5,116 అందజేయనున్నట్లు తెలిపారు. పేర్లు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 14 అని చెప్పారు. ఇతర వివరాలకు 9966419020, 9912951780, 9059089535 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఆర్గనైజర్లు నరసప్ప, విజరు, హేమంత్‌, వీరేష్‌ పాల్గొన్నారు.

➡️