కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

Dec 18,2023 19:51

సమావేశంలో మాట్లాడుతున్న బాబురావు

– డిసిసి అధ్యక్షులు బాబురావు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని డిసిసి అధ్యక్షులు బాబురావు తెలిపారు. సోమవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, దేశంలోనూ అత్యధిక మెజార్టీతో గెలుపొంది కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టే సమయం దగ్గర పడిందన్నారు. మోడీ ప్రభుత్వానికి కీలుబొమ్ముగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకునే దిశలో కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బోయ నీలకంఠప్ప, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు దిలీప్‌ ఢోకా, మైనార్టీ సంఘం జిల్లా జిల్లా కన్వీనర్‌ ఎమ్‌ఎమ్‌డి.నూర్‌, సాయినాథ్‌, లక్ష్మీనారాయణ, దేవిశెట్టి వీరేష్‌, మద్దిలేటి పాల్గొన్నారు.

➡️