తల కిందులుగా క్లాప్ డ్రైవర్ల నిరసన

Jan 22,2024 17:02 #Kurnool
clap drivers strike 37th day
  • సమస్యలు తీర్చకపోతే సమ్మో ను ఉదృతం చేస్తాం
  • కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ క్లాప్ ఆటో డ్రైవర్లు తల కిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు.
  • 37వ రోజుకీ చేరుకున్న మునిసిపల్ క్లాప్ డ్రైవర్ల సమ్మె

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : మున్సిపల్ క్లాప్ డ్రైవర్లు కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట క్లాప్ ఆటో డ్రైవర్లు తల కిందులగా నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రఘు శేఖర్ అధ్యక్షత వహించారు. 37వ రోజు సమ్మె కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓల్డ్ సిటీ సిఐటియు నగర నాయకులు డి. కుమార్ కార్మికులను ఉద్దేశించిమాట్లాడుతూ కార్మికులు గత 36 రోజులుగా పెండింగ్ లో ఉన్న12నెలలజీతాలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పి.ఎఫ్ అమలు చేయాలని, పని భద్రత, వీక్లీ ఆఫ్ లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అగ్రిమెంట్ ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లతో శాంతి యుతంగా సమ్మె చేస్తుంటే అధికారులు కానీ,ప్రజాప్రతిని గాని,ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అన్నారు. కర్నూల్ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తుందని, గాలికి చెత్తంతా డ్రైనేజీకాలువలో పడిమురిగిపోయి దుర్గంధ వాసనతో దోమలకు నిలయాలుగా దోమలు విపరీతంగా పెరిగి పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉన్నది . కనుక ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అధికారాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే క్లాప్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి నగరాన్ని చెత్త మయంగా కాకుండా స్వచ్ఛ నగరంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలలో కార్మికులతో కలిసి మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగి త్వరలో రాబోతున్న ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు క్లాప్ డ్రైవర్ యూనియన్ నాయకులు రఘుశేఖర్,నరేష్ నవీన్,బాబ్జి, పరమేష్ చంద్రశేఖర్, మొదలగు వారు పాల్గొన్నారు.

➡️