గెలిపిస్తే కల్లూరును అభివృద్ధి చేసి చూపుతా : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్‌ దేశాయ్

Apr 18,2024 12:20 #karnool

ప్రజాశక్తి-కర్నూలు :ఎన్నో సంవత్సరాలుగా కల్లూరు అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యమే అని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి డి గౌస్‌ దేశాయ్ అన్నారు. గురువారం నగరంలోని కల్లూరు లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కల్లూరులో ఇంటింటికి కరపత్రాన్ని పంచుతూ ప్రచారాన్ని నిర్వహించారు. సిపిఎం కు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లూరు కర్నూలు మున్సిపాలిటీలో చేర్చి దశాబ్దాలు పైబడినా నేటికీ కల్లూరు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. రోజు మార్చి రోజు మంచినీరు తాగాల్సి వస్తుందన్నారు. గతంలో సిపిఎం ఎమ్మెల్యేగా పోరు నేతృత్వంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం మరో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించి ఉంచారన్నారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రజల కష్టాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారన్నారు. తద్వారా తాగునీటికి ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోందని విమర్శించారు. తమను గెలిపిస్తే రోజు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికంగా కల్లూరు నుంచి దేవ నగర్‌ కు వెళ్లే బ్రిడ్జి పై విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో కారు చీకటి తమ్ముకోవడంతో రాత్రివేళ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నారు. పశువుల ఆసుపత్రి నుండి మెయిన్‌ రోడ్డుకు రోడ్డు సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కల్లూరు పిహెచ్‌సిలో జనాభా కు అనుగుణంగా వైద్యులను, సిబ్బంది సంఖ్యను పెంచాలని, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాత కల్లూరు లో డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుందన్నారు. తద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నావేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల వీధిలైట్లు వెలగడం లేదని కల్వర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అండగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఏం రాజశేఖర్‌ నాయకులు రమణమూర్తి నాగరాజు సుధాకర్‌ అప్ప గోవిందు వెంకటరాముడు శీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️