అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Feb 19,2024 16:39 #Kurnool

ప్రజా సేవకు అంకితమవుతా : టిడిపి నాయకులు ఎల్లార్తి మల్లికార్జున
ప్రజాశక్తి-దేవనకొండ : టిడిపి అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దేవనకొండకు విచ్చేసి ముందుగా అంబేద్కర్, వాల్మీకి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేశారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలకే పరిమితమైందని గ్రామాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజా సేవలో ముందు ఉంటానన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర, డీజిల్, పెట్రోల్, బస్ చార్జీలు పెంచి అదనపు భారం మోపిందన్నారు. ఆలూరు నియోజకవర్గం లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని కరువు మండలాలు ప్రకటించినప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించలేకపోయింది అన్నారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టిడిపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని మండల ప్రజలను కోరారు. టిడిపి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నియోజవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి టిడిపి బలోపేతానికి తన వంతు పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిమ్మప్ప,అంజి, ఈరన్న, భీమ, చంద్ర, రవి, మోహన్, శేఖర్, నవీన్, ప్రకాష్ పాల్గొన్నారు.

➡️