ఆటో కార్మికుల కండగా ఉండే వారిని గెలిపించుకుందాం 

Apr 1,2024 16:40 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కార్మిక నేత అయినటువంటి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని పాత బస్టాండ్ నందు గల సాయిబాబా ఆటో స్టాండ్ డ్రైవర్లు తెలియజేశారు. సోమవారం నగరంలోని కొత్తపేట ఏరియా ఆటో డ్రైవర్ల సమావేశం. సాయిబాబా గుడి ఆవరణలోని ఆటో స్టాండ్ నందు ఓల్డ్ సిటీ ఆటో యూనియన్ సిఐటియు.. అధ్యక్షులు ఏ.రవి కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్దేశాయ్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు. నాగరాజు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్లు హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల నుద్దేశించి వారు మాట్లాడుతూ…. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగడ్రైవర్లకు భారంగా మారిన చట్టాలను జీవో లు తీసుకొచ్చి రవాణా రంగంపై కోట్లాది రూపాయలు భారాల మోపుతున్న వ్యతిరేకించకుండా బిజెపికి అనుకూలంగా వైసీపీ, టిడిపి సభ్యులు వ్యవహరిస్తున్నారని కార్మికులపై భారాలు పడుతున్న చోద్యం చూస్తూ బిజెపి అడుగులకు మడుగులు వత్తే వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి లు కావాలా కార్మిక ,ప్రజా శ్రేయస్కై పాటుపడుతూ ఆటో కార్మికులకు ఏ ఇబ్బందులు వచ్చినా తక్షణం స్పందిస్తూ ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న సిపిఎం అభ్యర్థి కావాలో కార్మికులు ఆలోచించుకోవాలని వారన్నారు. ఇలాంటి పార్టీలను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు.
కరోనా కష్టకాలంలో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా ప్రభుత్వాలు పెంచాయని వారన్నారు. దేశంలో ముడిచమ్మరు ధరలు తగ్గిన మనదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా అనునిత్యం పెంచుతూ ఒక్కొక్క ఆటో డ్రైవర్ పై సంవత్సరానికి వేల రూపాయలు ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని వారన్నారు.
ఇప్పటిదాకా చట్టసభల్లో వామ పక్షాలు లేనందున ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అదే వామపక్షాలు చట్టసభల్లో ఉంటే ప్రభుత్వ ఆటలు సాగవని కావున ప్రజలు. ఆలోచించి రానున్న ఎన్నికల్లో కార్మిక నాయకులు ప్రజా సంక్షేమం కోరే సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు ఆటో డ్రైవర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సిఐటియు సాయిబాబా, స్టాండ్ సీనియర్ నాయకులు వీరన్న ,సామేలు, చిన్న, జీవన్, పెద్ద రంగస్వామి, చిన్న భాస్కర్, రామచంద్ర, ప్రేమ్ కుమార్, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గౌస్ దేశాయ్ కి ఆటో డ్రైవర్లు పూలమాలతో వేసి తమ సంఘీభావాన్ని తెలిపారు.

➡️