డిఐజి కార్యాలయంలో 75వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు

Jan 26,2024 14:06 #Kurnool
republic day celebration in kurnool

జాతీయ పతాకాన్ని ఆవిష్కరరించిన డిఐజి యస్.సెంథిల్ కుమార్

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి యస్.సెంథిల్ కుమార్ ఐపియస్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు. గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ వాసు దేవ్, డిఐజి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️