బీసీ డిక్లరేషన్ హర్షణీయం

Mar 8,2024 17:04 #Kurnool
  • టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
    పాలకవీటి విజయకుమార్

ప్రజాశక్తి-కర్నూలు క్రైం : పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బిసిలకు డిక్లరేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలకవీటి విజయకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బిసిల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ బాబు కర్నూల్ జిల్లా బీసీల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. బీసీ లను రాజకియంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో రానిచ్చే విదంగా జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. బీసీ ల్లో 154 కులాలు ఉన్నాయని, వీరిని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేలుగా చేసి మిగిలిన కులాలను ఎంఎల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, చట్ట సభలకు పంపే విదంగా చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం హర్షణీయం అన్నారు.
బీసీ లకు అంత్యంత ప్రాధాన్యత ఇస్తూ 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తూ..3 వేల నుంచి 4 వేల రూ. పెంచుతామని హామీ ఇచ్చారని, దీంతో బిసి లంతా రుణపడి ఉంటామన్నారు. సమాజంలో గౌరవము, రక్షణ కల్పించేవిదంగా ప్రత్యేక పదునైన రక్షణ చట్టం తెచ్చి, సామజిక న్యాయ పరిశీలన కమిటీ వేసి బీసీల హక్కులను కాపాడుతామన్నారు.ఈ ప్రభుత్వంలో 24 % రిజర్వేషన్ను తగ్గించి 16,800 మందిని బీసీ లకు అన్యాయం చేశారని, తిరిగి టీడీపీ ద్వారా 34% స్థానిక సంస్థల్లో నాయకత్వం పెంచేవిదంగా పునరుద్దరణ చేస్తామని చెప్పారన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 30 వేల కోట్లు చొప్పున అయిదు సంవత్సరాలకు 1.5 లక్షల కోట్లు బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్ట పరమైన నిధులు తీసుకుంటామన్నారు.
జనాభా దమాషా ప్రకారం బీసీ ల ఆర్థికాభివృద్ధి స్వయం ఉపాధి కోసం బీసీ కులాల కార్పొరేషన్ల ద్వారా 10 వేలకోట్లు ఖర్చు చేస్తామన్నారు. చట్టబద్దంగా కులగణన, చంద్రన్న భీమా 10లక్షలు, పెళ్లి కానుకలు లక్ష పెంచుతామాన్నారు. శాశ్విత కులధ్రువీకరుణ పత్రం అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగవాల మునుస్వామి, తెలుగుదేశం పార్టీ రజక సంఘం జిల్లా నాయకుడు భద్రపల్ల హరి పాల్గొన్నారు.

➡️