ఆశ్ర‌మంలో మహిళ దినోత్స‌వ వేడుక‌లు

Mar 8,2024 16:42 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : జీవనజ్యోతి ఆశ్రమంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌రంలో శుక్ర‌వారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వ‌హించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశ్రమ వృద్ధుల‌తో మహిళ దినోత్సవం చేసుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఇద్దరు మహిళలకు సన్మానించారు. అనంతరం అక్కడున్న వారందరికీ కేసరి(స్వీట్), కారా మిక్చర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజ్, దినేష్, పవన్, యశ్వంత్ పాల్గొన్నారు.

➡️