ప్రభుత్వ బడిని రక్షించుకుందాం : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వ బడని రక్షించుకుందామని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌. జాబీర్‌ పేర్కొన్నారు. శనివారం ‘ప్రభుత్వ బడిని రక్షించుకుందాం పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం’ అనే కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం అలిమాబాద్‌ ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాబీర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో నైతిక విలువలు, చదువు, సంస్కారం, దేశభక్తి, సమానత్వ భావనలు ఏర్పడేలా విద్యాబుద్ధులు నేర్పించబడతాయని, అటువంటి బడిని ఉపాధ్యాయులు కాపాడుకొని సమాజాభివద్ధికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం, ప్రభుత్వ బడిలోని సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఊరి బడిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్లేందుకు కషి చేయాలని పిలుపునిచ్చారు. కామన్‌ స్కూల్‌లో ధనిక,పేద, కుల,మత భేదాలు లేని బడి ప్రభుత్వ బడి అని వారు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ బడిలో చదివే తల్లిదండ్రులందరికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా బడిని తీర్చిదిద్దడంలో నిమగం కావాలని విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో చదవడం రాయడం మాట్లాడడం నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలన్నారు. యుటిఎఫ్‌ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనే కాక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలోనూ, సామాజిక సేవా దక్పథం లోను, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయచోటి మండల ప్రధాన కార్యదర్శి సి.రాజా రమేష్‌, చాన్‌ బాషా, జయన్న, రహంతుల్లా, మహమ్మద్‌, ఇలియాస్‌, జగదీష్‌,రాజబాబు పాల్గొన్నారు.

➡️