‘ఆడుదాం ఆంధ్ర’ను విజయవంతం చేయండి

Dec 11,2023 20:41

సాలూరు : ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంద్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర కోరారు. సోమవారం రాజన్నదొర నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆడుదాం ఆంద్రా క్రీడా సామగ్రిని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, బాడ్మింటన్‌ క్రీడలకు సంబంధించిన సామగ్రిని సచివాలయాల వారీగా పంపిణీ చేయాలని ఆదేశించారు. మొత్తం 2262 మంది క్రీడల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు వుంటాయని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో, అక్కడ విజేతగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని చెప్పారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌ లు గొర్లి వెంకటరమణ, పప్పల లక్ష్మణరావు, మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, వైసిపి నాయకులు సింగారపు సింహాచలం పాల్గొన్నారు.ఆడుదాం ఆంధ్ర మెటీరియల్‌ పంపిణీ సీతంపేట : మండలంలో 31 సచివాలయాల సిబ్బందికి సోమవారం వైటిసిలో డిడిఒ వివి గోపాలకృష్ణ, ఎంపిపి బి. ఆదినారాయణ చేతుల మీదుగా ఆడుదాం ఆంధ్రా మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తిచేసి గ్రామాల్లో క్రీడలు నిర్వహించి ఎంపికలు నిర్వహించాలన్నారు. జనవరి వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, వైసిపి నాయకులు ఎస్‌ రాము, ఐటిడిఎ స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ ఎన్‌ జాకబ్‌ దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️